Breaking News

శ్రీ మావుళ్ళమ్మ

 

భీమవరం

 

     గోదావరి నదికి పశ్చిమ తీరంలో “పశ్చిమ గోదావరి జిల్లా” ఉంది. జిల్లాలోని ఏలూరు పిదప అతి పెద్ద పట్టణం ” భీమవరం “. ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యడు పాలించాడు. భీమ చాళుక్యడు పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఇతడు క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు. భీమవరం పట్టణంలో గునుపూడి ఒక ప్రాంతము. ఇచ్చట శ్రీ సోమేశ్వర దేవాలయం ను దర్శించగలం. ఇది పంచారామాల లో ఒకటిగా ప్రతీతి. గునుపూడి శ్రీ సోమేశ్వర దేవాలయంకి పశ్చిమ దిశగా సుమారు ఒక కీ.మీ దూరన శ్రీ మావుళ్ళమ్మ గుడి ఉంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామ దేవత. భీమవరం నగర నడిబొడ్డున కొలువు తీరిన శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం యొక్క సంవత్సర ఆదాయం సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా ఉంటుంది అని చెప్పుచుంటారు. దేవస్థానం వారు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుతారు. ప్రతి నిత్యం భక్తులుకు అన్నదానం జరుపుతారు.

     ఆలయం చాల ప్రాచీనమైనది. 1910 లో వచ్చిన వరదలలో విగ్రహం పాక్షికంగా దెబ్బతినటంతో నూతనగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కరుణారసమూర్తి. అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. జ్యేష్ట మాసంలో నెల రోజులు పాటు గ్రామ జాతర గరగ ఉత్సవాలు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్బముగా అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమం మరియు ఇతర పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి ఉత్సవాలు 40 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలు సందర్భంగా బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరికథలు, ఏకపాత్రాభ్నయాలు మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి ఎనిమిది రోజులలో అమ్మవారిని అష్ట లక్ష్మీలుగా అలంకరించి సేవించుతారు. చివరిరోజున వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

చరిత్రవిశేషాలు:

     1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ, అక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైనది. మంచిరాజు, అప్పన్నలు కలసి ఆ మామిడి తోటలో ఒక పాక వేసి, అమ్మవారిని నిత్యం పూజించేవారు. పిమ్మట అమ్మవారి ఆదేశానుసారం అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలసిన అమ్మవారు కాబట్టి శ్రీ మామిళ్ళమ్మగా పిలిచేవారు. కాల క్రమంలో శ్రీ మావుళ్ళమ్మగా ఖ్యాతి పొందినది.

     శ్రీ మావుళ్ళమ్మ గుడి ఉన్న ప్రాంతమును “ఆదివారం బజార్” గా పిలుస్తారు. భీమవరం పట్టణం లోని అన్ని ప్రాంతములు నుంచి ఆదివారం బజార్ కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. యనమదుర్రు గ్రామం లోని శ్రీ శక్తీశ్వర స్వామి (శివాలయం) ఆలయం వైపు పోవు బస్సులు, షేరింగ్ ఆటోలు ఆదివారం బజార్ నుంచి బయలుదేరుతాయి. శ్రీ మావుళ్ళమ్మ గుడి కి సుమారు 700 మీటర్లు దూరం లో RTC Bus Stand, సుమారు

1 కీ.మీ దూరం లో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్, మరో దిశ వైపు సుమారు 1.5 కీ.మీ దూరం లో భీమవరం జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *