Breaking News

హనుమాన్ చాలీసా మహత్యం

0_small chalisa

ఉత్తరభారత దేశంలో క్రీ శ 16 వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసి దాస్ను సాక్షాత్తూ ¬¬వాల్మికి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్‌పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసిదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకధను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ సంస్క­ృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామ కథను సుపరిచితం చేసింది.
వారణసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసిదాస్ నిరంతరం రామనామామృతంలో తెలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలమందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో చెడ్డవారు సైతం అపర రామభక్తులుగా మారుతూండేవారు. అయితే సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు.ఇది ఇలాగ ఉండగా వారణసి¬లో ఒక సదాచార సంపన్నుడైన గ్రుహస్తు,తన ఎకైక కుమారునికి చక్కని అమ్మయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తుండగా, విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపొయిన అతని భార్య హృదయవిదారకముగా విలపించసాగింది.చనిపొయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా నిలువరిస్తుండగా ఆమె అక్కడ పక్కనేవున్న తులసీదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాలవద్ద పడి రోదించసాగింది.

రామ భక్తి మహిమ:
అప్పుడు ఆయన రామ నామ ధ్యానంలో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు తెరిచి ఆమెను చూసి దీర్ఘసుమంగళీ భవ అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీదాస్ కు విన్నవించుకుంది. అప్పుడు తులసీదాస్ గారు….నా నోట అసత్యం పలికించడు రాముడు….అని అంటూ…..అప్పుడు ఆయన తన కమండలంలో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు క్షణం అతను పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటన ప్రత్యేకించి తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికీ ఎక్కువ అయిపోసాగింది.
ఇంక ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషాహ్ వద్దకు వెళ్ళి జరుగుతున్నది వివరించి తగిన చర్య తీసుకోవల్సిందిగా ఒత్తిడి తెచ్చారు.

అప్పుడు ఆ పాదుషాహ్ వారు తులసీదాస్‌ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయ¬నతో విచారణ ఇలాగ సాగింది. తులసీ దాస్…మీరు రామనామం అన్నిటి కన్న గొప్పది అని ప్రచారం చేస్తున్నారట? అని పాదుషాహ్ అడగగానే తులసీదాస్ వినమృడై అవును ప్రభు! ఈ సకల చరా చర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు.! అనగానే పాదుషాహ్ వారు ఇలా స్పందించారు…సరే…మేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము…దానికి ప్రాణం పొయ్యండి …రామ నామంతో బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము…అనగానే క్షమించండి ప్రభు! ఫ్రతి జీవికి జనన మరణాలు జగ్రత్పభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి….మానవమాత్రులు మార్చలేరు.. అంటూ బదులుపలికాడు తులసీదాస్…అందుకు కోపంగా పాదుషాహ్… అయితే తులసీ దాస్ జీ! నీమాట ను నిలుపుకో లేకుంటే.. మీ అబద్ధాలు నిరూపించూకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబధ్ధాలు అన్నీ అబద్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి అనగానే…

పాదుషాహ్ ఆగ్రహం:
తులసీ దాస్ క్షమించండి …నేను చెప్పేది నిజం అనగానే…పాదుషాహ్ కి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తులసీదాస్‌జీ…మీకు ఆఖరి సారి అవకాశం ఇస్తున్నాను…నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో…..నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.. అని పాదుషాహ్ వారు తీవ్ర స్వరంతో ఆఞ్ఙాపించాడు. అప్పుడు తులసీ దాస్ కనులు మూసుకుని, ధ్యాన నిమఘ్నుడై శ్రీ రామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు.అది రాజధిక్కారముగా భావించిన పాదుషా తులసీదాస్‌ను బంధించమని ఆదేశించాడు.

కదలివచ్చిన వానర దండు:
ఎక్కడ నుండి వచ్చాయో ….కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేసించి తులసీ దాస్‌ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులైపోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్‌కు సింహద్వారంపై హనుమ దర్శనం ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేసారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ తులసీ! నీ స్తోత్రముతో మాకు చాల ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో…. అన్నారు..అందుకు తులసీదాస్ తండ్రీ! నాకేమి కావాలి….! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని తులసీదాస్ కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింత ప్రీతిచెందిన హనుమ తులసీ ఈ స్తోత్రంతో మమ్మల్ను ఎవరు స్తుతించినా ,వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు హనుమాన్ చాలిసా కామధేనువు అయ్యి భక్తులను కాపాడుతునే ఉంది.

అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా…దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికీ వెలుగుతునే ఉంటుంది…

నిత్య దైవారాధనలో: మన నిత్య దైవారాధనలో హనుమాన్ చాలీసా కూడా తప్పక ఉంటుంది. మన ఇళ్ళలో చిన్నపిల్లలకు సైతం హనుమాన్ చా¬లీసా నేర్పించడం మనకు పరిపాటి. ఈ చాలీసాను రచించింది తులసీదాసు. అసలు ఈ చాలిసా అనునది ఎలా వచ్చిందో తెల్సుకొందాం. వారణాసి లో ఉండే తులసిదాసు గొప్ప రామ భక్తుడు. నిత్యం రామనామ సంకీర్తనలో కాలం గడుపుతూ, అందరికి రామనామ దీక్షను ఇస్తూ, అద్యాత్మికతను అందరికి భోదించేవాడు. ప్రజలు కూడ తులసిదాసు తో కలిసి రామనామ సంకీర్తనలు చేసేవారు.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలీం
శ్రీ రామభక్త హనుమతే నమః
దశభుజ హనుమంతుడు:

యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.

హనుమాన్… ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా?

అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని వేడుకున్నాడు. అప్పుడు రాముడు నారదమహర్షి…రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు. యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *