Breaking News

12 నదులు.. 12 పుష్కరాలు.. 12 రోజులు..

దేశంలో అతి పవిత్రంగా 12 నదులు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నదులకు 12 రాశుల వారీగా ఒక్కో నదికి ఒక్కో సంవత్సరంలో పుష్కరాలు వస్తాయి. ఈ విధంగా గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలోని నదికి పుష్కర శోభ సంతరించుకుంటుంది.
గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగానదికి….
వృషభరాశిలో నర్మదనదికి…
మిధునంలో సరస్వతినదికి…..
కర్కాటకంలో యమునానదికి…
సింహరాశిలో గోదావరినదికి…
కన్యారాశిలో కృష్ణానదికి..
తులారాశిలో కావేరి నదికి…
వృచ్చిక రాశిలో తుంగభద్ర నదికి..
ధనస్సు రాశిలో తామ్రవర్ణి నదికి…
మకరం రాశిలో సింధునదికి…
కుంభరాశిలో భీష్మనదికి..
మీనరాశిలో ప్రాణహిత నదికి..
ఈ విధంగా గురుడు ప్రవేశించే రోజు నుంచి 12 రోజుల పాటు ఆయా నదులకు పుష్కరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పుష్కర స్నానం..
నవ గ్రహాల్లో గురుడు చాలాకీలకంగా చెబుతారు. పుష్కర కాలాల్లో ఆయా నదుల నీటిలో ముక్కోటి దేవతులు, బ్రాహ్మణులుఋషులు, మునులు కొలువుతీరి ఉండటంతో సకల పాపాలు ప్రాయశ్చితమవుతాయనేది ప్రగాఢ విశ్వాసం. పుష్కర స్నానంచేస్తే సప్తయాగాలు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం.

ఆది, అంత్య పుష్కరాలు….
పుష్కరాలు ప్రారంభ రోజు మొదలుకుని 12రోజుల పాటు ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ సమయంలో గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించడం ప్రతి వ్యక్తికీ ఎంతో ముఖ్యమని వేదపండితులు చెబుతారు. పుష్కరాలు వచ్చిన ప్రతియేటా చివరన మళ్లీ అంత్యపుష్కరాలని 12రోజులు నిర్వహిస్తుంటారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *