Breaking News

వాడపల్లి వెంకన్నకు మహా పుష్పయాగం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో మహా పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తకలశాలతో అభిషేకం, ప్రధానహోమాలు, నీరాజన మంత్రపుష్పాలు తదితర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారికి మహా పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *