Breaking News

ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన యామిని సాధినేని

నవ్యాంధ్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ నేత సాధినేని యామిని కలిశారు. తనపేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ అకౌంట్‌ క్రియేట్ చేసిన వారు ఎవరో తెలుసుకుని కఠినంగా శిక్షించాలని ఆమె డీజీపీని కోరారు. కాగా.. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *