Breaking News

నా బలం,* *వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటా.* *ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.

IMG-20210715-WA0031*దళితులే నా బలం,*

*వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటా.*

*ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.న్ననలు పొందుతా.గత సంఘటనలు,బాదనిచ్చాయి.కష్టాల్లో తోడుంటా,కన్నీళ్లు తుడుస్తా అని దళితులు ఎమ్మెల్సీ తోట త్రిముర్తులు కు చేసిన ఆత్మీయ సన్మాన సభలో దళితులను ఉద్దేశించి తోట అన్నారు.ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులు ను నియమించిన ముఖ్యమంత్రి వైయస్స్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తు మండపేట నియోజకవర్గ దళితులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను ఘనంగా సన్మానించారు.ముందుగా భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్,మాజీ ఉపప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రామ్,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్స్ రాజశేఖర్ రెడ్డి ల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారికి తోట ఘన నివాళులు అర్పించారు.మండపేట నియోజకవర్గం నలుమూలల నుండి వేలాది మంది దళితులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.దళితసోదరులకు తనకు మధ్య దూరం పెంచాలని కేవలం కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని,కుట్రలు కలకాలం సాగవని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు తనపై ఎల్లప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.దళిత సోదరులు అండదండలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తోట అన్నారు.దళితసోదరులారా సంతోషంగా ఉన్నపుడు తనకు చెప్పాల్సిన అవసరం లేదని కష్టాల్లో ఉంటే మాత్రం మీకు అండగా తోట త్రిమూర్తులు ఉన్నాడని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో మండపేట నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తోట త్రిమూర్తులు ను ఘనంగా సత్కరించారు.కొందరు నాపై దుష్పచారం చేసినా గాని నాపై నమ్మకం ఉంచి నాకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్స్ జగన్ మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటానని తోట అన్నారు.ఎన్నో రకాల సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సదస్సు నిర్వహించారు.ఎమ్మెల్సీ తోటను పూలమాలలతో ముంచెత్తారు.దుశ్శాలువాలతో సత్కరించారు,మెమోంటోలు ఇచ్చి తోట పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న తరుణంలో పనులుమానుకొని నా సన్మాన సభకు అశేష సంఖ్యలో విచ్చేసిన ఎస్సీ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తు,వారికి సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని తోట పేర్కొన్నారు.కోర్టు పరిధిలో ఉన్న అంశాలు బయట మాట్లాలడాకూడదనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నానని,మాట్లాడం చేతకాక కాదన్నారు.తనకి ఎవరి మీద కోపం,ద్వేషం లేదన్నారు.ఎస్సీల నుండి తనను దూరం చేసేందుకు కొంత మంది వ్యక్తులు చేసే ప్రయత్నమని పేర్కొన్నారు.ఎన్ని కష్టాలు,సమస్యలైన ఎదుర్కొంటానని,దళితుల ప్రేమ,ఆశీస్సులు,అభిమానం కావాలని కోరారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఎస్సీల ఆశీస్సులు ఉండగా నన్నేమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.మండపేట చరిత్రలో ఈ సభ నిలిచిపోతుందని పేర్కొన్నారు.తనపై అభిమానం చూపిన అందరికీ పేరు పేరునా తోట కృతజ్ఞతలు తెలిపారు.2024 సంవత్సరంలో వచ్చె ఎన్నికల ముందే ఈ నియోజకవర్గంలోని ఎస్సీ సోదరుల దీర్ఘకాలిక సమస్యలు అన్ని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.అందరిలో ఒకడిగా ఉంటానని,అందరి మన్ననలు పొందుతానని స్పష్టం చేశారు.తాను 1994 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే తన వెన్నంటి ఉండి తన గెలుపుకు కారణమైన దళిత సోదరులు రుణాన్ని తీర్చుకుంటానన్నారు.దళిత సోదరులతో నాకు దాదాపు 25 ఏళ్ళ నుండి అనుబంధం ఉందన్నారు.1997 సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన తన మనసును గాయపర్చిందన్నారు.శిక్షలకు భయపడేవాడిని కాదని కేసులకు తలొగ్గే నేతను అసలే కాదని స్పష్టం చేశారు.పేద,బడుగు,బలహీన వర్గాల మద్దతుతోనే పార్టీలకతీతంగా దీర్ఘకాలికంగా శాసనసభ్యుడిగా పని చేశానని పేర్కొన్నారు.టిడిపి,కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.అన్ని ఎన్నికల్లోనూ తన గెలుపులో ఎస్సీలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.అటు రామచంద్రపురం ఇటు మండపేట నియోజకవర్గాలలో తనను ఆదరిస్తున్న దళిత సోదరులందరికీ ఎమ్మెల్సీ తోట కృతజ్ఞతలు తెలియజేశారు.మండపేట నియోజకవర్గంలోని ప్రజలందరి సంక్షేమం కోసం పని చేస్తానని నన్ను అభిమానించే వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.తొలుత కలువ పువ్వు సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.ఎస్సీలలో తోటకు తరగని ఆదరణ ఉందన్న సంకేతాలు ప్రత్యర్థులకు ఇచ్చారు.గారడీలు,తీన్మార్ నృత్యాలు,డప్పు వాయిద్యాలు,భారీ ఎత్తున బాణాసంచ కాల్పులతో ర్యాలీ ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి,వైయస్సార్ కాంగ్రెస్ ఫార్ఠీ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి,కర్రి పాపారాయుడు,రెడ్డి రాజబాబు,దూలం వెంకన్నబాబు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట టౌన్ ప్రెసిడెంట్ ముమ్మిడివరపు బాపిరాజు,కాళ్ళకూరి నాగబాబు,పెంకె గంగాధర్,ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం,మాజీ కౌన్సిలర్లు కొల్లి వరలక్ష్మి,తనికెళ్ళ పల్లవి,వైసిపి నాయకులు వల్లూరి రామకృష్ణ,నక్కా సింహచలం కొవ్వాడ బేబి,దళిత సంఘ నాయకులు,వేలాది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.                                                                                                   నవీన్ కుమార్                                                                కొత్తపేట నియోజకవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *