*మహిళాపోలీసులుమహిళలలో ఆత్మస్థైర్యాన్ని- ధైర్యాన్ని నింపాలి *
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వృత్తి నైపుణ్య శిక్షణ లో భాగంగా ఈరోజు ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామ సచివాలయ మహిళాసంక్షేమ కార్యదర్శులకు ( మహిళా పోలీసులు) ఆత్రేయపురం ఎంపీడీఓ నాతి బుజ్జి మండల పరిషత్ అంశాలపై శిక్షణ నిచ్చారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూమహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతీ సచివాలయానికి ఒక మహిళా పోలీసును నియమించారనీ వారి పరిధిలో ఉన్న ప్రతీ మహిళ రక్షణ కు భరోసా కల్పించేలా మహిళా పోలీసులు వ్యవహరించాలనీ విధులను అంకితభావంతో నిర్వహించాలనీ దిశా చట్టం దిశా యాప్ లపై విస్తృత అవగాహన కల్పించాలనీ అన్నారు. ఈ శిక్షణ లో పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్, కార్యాలయ ఏఓ రామస్వరూప్ , మహిళ పోలీసులు పాల్గొన్నారు. నవీన్ కుమార్ కొత్తపేట నియోజకవర్గం