Breaking News

ఆధునిక రాజధాని రూపురేఖ‌లు ఇలా..

  • capital-chandrababu
  • మంగళగిరి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం.. అందుబాటులో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి
  • పీపీపీ విధానంలో అభివృద్ధికి నిర్ణయం
  • రాజధాని ప్రాంతంలో సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌
  • రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికకు కేబినెట్‌ ఆమోదం
  • జూన్‌ నెలాఖరుకు సీడ్‌ కేపిటల్‌ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌

  బ్రేకింగ్ న్యూస్ నెట్ వ‌ర్క్:

దేశవిదేశాలకు రాకపోకలను సుగమం చేసేలా మంగళగిరి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువుదీరే సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌.. వ్యాపార, వాణిజ్య, వినోద కేంద్రాల నెలవుగా 8 కిలోమీటర్ల వైశాల్యంలో సీడ్‌ కేపిటల్‌.. దాని తర్వాత 271 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రాంతం.. ఇలా సర్వహంగులతో నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రణాళిక తుది మెరుగులు దిద్దుకుంటోంది.

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అవసరాలను తీర్చే అంతర్జాతీయ విమానాశ్రయం మంగళగిరి వద్ద రానుంది. మంగళగిరికి పశ్చిమ దిశలో ఉన్న 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో ఈ ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంగా నమోదు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం అనుమతులన్నీ వచ్చి నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఐదారేళ్లు పడుతుందని అంచనా. అప్పటిదాకా గన్నవరం విమానాశ్రయాన్ని వినియోగిస్తారు. శంషాబాద్‌ విమానాశ్రయాన్ని నిర్మించిన తరహాలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ)తో ప్రైవేట్‌ డెవలపర్‌కు అప్పగించే వీలుంది. మంగళగిరి.. అటు కొత్త రాజధానికి ఇటు విజయవాడ గుంటూరుకు కూడా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
కోర్‌ కేపిటల్‌ కాదు సీడ్‌ కేపిటల్‌
తుళ్లూరు వద్ద ఎంపిక చేసిన కొత్త రాజధాని ప్రాంతంలో సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాజధాని ప్రాంతంలో కృష్ణా నదీ తీరం పొడవునా వినోద విహార కేంద్రాలు రానున్నాయి. అందమైన ఉద్యానవనాలు, వాటర్‌పార్క్‌లు, థీమ్‌పార్క్‌లను నది ఒడ్డున నిర్మిస్తారు. దాని పక్కన సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌ వస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార సంస్థల కార్యాలయాలు, వాణిజ్య భవనాలు ఉంటాయి. ఇందులో కొంత భాగాన్ని ప్రభుత్వ అవసరాలకు కేటాయించి కొంత భాగాన్ని వాణిజ్య ప్రాంతం(కమర్షియల్‌)గా గుర్తిస్తారు. వాణిజ్య ప్రాంతంగా గుర్తించిన ప్రాంతంలోనే వ్యాపార, వాణిజ్య భవనాలకు అనుమతులొస్తాయి. వాటిని ఆనుకొని నివాస భవనాలు ఉంటాయి. రాజధాని ప్రాంతంలో పనిచేసే అధికారులు ఉద్యోగులు, ఇతరులకు అవసరమైన నివాస, వసతి దీని ద్వారా లభ్యమవుతుంది. వాటి చుట్టు పక్కల ఆసుపత్రులు, విద్యాలయాలు, ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన భవనాలు వస్తాయి. రాజధాని ప్రాంతం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక వ్యాపార, వాణిజ్య కేంద్రంగా అభివద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని వల్ల కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు ఆదాయం కూడా వస్తుందని అధికారవర్గాలు అభిప్రాయపడతున్నాయి. ఈ మొత్తం కార్యాకలాపాలు జరిగే ప్రాంతాన్ని ప్రభుత్వం సీడ్‌ కేపిటల్‌గా వ్యవహరిస్తారు. గతంలో కోర్‌ కేపిటల్‌గా ఉన్న పేరును ప్రస్తుతం సీడ్‌ కేపిటల్‌గా మార్చారు. ఇది 8 కి.మీ వైశాల్యంలో ఉంటుంది. దీని తర్వాత 271 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని ‘రాజధాని ప్రాంతం’గా గుర్తించనున్నారు. సీడీ కేపిటల్‌ను, రాజధాని ప్రాంతాన్ని కలిపి అమరావతిగా పిలవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీని తర్వాత 7 వేల కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌డీఏగా పిలుస్తారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అత్యధిక భాగం సీఆర్‌డీఏ పరిధిలోకి రానుంది.
భవిష్యత్తు అవసరాలపై దృష్టి
భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా, నూతన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజారాజధాని సర్వహంగులతో రూపుదిద్దుకోనుంది. రైలు మార్గాలను పరిశీలిస్తే విజయవాడ జంక్షన్‌కు రాకుండానే ట్రాఫిక్‌ మల్లింపు కోసం కృష్ణానదిని క్రాస్‌చేస్తూ నందిగామ-సత్తెనపల్లి, గుడివాడ-తెనాలి రూట్లలో అదనపు రైలు మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పారిశ్రామికవృద్ధికి అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించనున్నారు. అభివృద్ధి కారిడార్‌లలో హైదరాబాద్‌-మచిలీపట్నం, నందిగామ కారిడార్‌లో.. ఫార్మా, బయోటెక్‌, ప్లాస్టిక్‌, ప్యాకేజింగ్‌. గుడివాడ కారిడార్‌లో.. గ్రీన్‌ ఇండసీ్ట్రస్‌, వ్యవసాయాధారిత పరిశ్రమలు. వైజాగ్‌-చెన్నై గన్నవరం కారిడార్‌లో.. ఐటీ, ఐటీయీఎస్‌, ఎలకా్ట్రనిక్స్‌, హార్డ్‌వేర్‌, ఆటోమోటివ్‌, ఎరోస్పేస్‌. గుంటూరు కారిడార్‌లో.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కోల్డ్‌ చెయిన్స్‌, టెక్స్‌టైల్స్‌, నాన్‌ మెటాలిక్‌ ఉత్పత్తులు. తెనాలి కారిడార్‌లో లాజిస్టిక్‌, టూరిజం అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. సత్తెనపల్లి కారిడార్‌లో.. టూరిజం, నాలెడ్జ్‌ సెంటర్‌. న్యూజివీడు కారిడార్‌లో ఆగ్రో, ఇండసి్ట్రయల్‌, ఫ్యాబ్రికేషన్‌ హబ్‌లను అభివృద్ధి చేస్తారు. ఇండసి్ట్రయల్‌ క్లస్టర్స్‌: ప్రస్తుతం ఇక్కడున్న పరిశ్రమల ఆధారంగా ఎకనమిక్‌ క్లస్టర్లను ప్రతిపాదించారు. విజయవాడ కాపిటల్‌ సిటీ, బిజినెస్‌ అండ్‌ ట్రేడింగ్‌ హబ్‌, ఆగ్రో ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆటో, ఐటీ, ఐటీయీఎస్‌, నందిగామలో.. ఫార్మాస్యూటికల్‌ హబ్‌, అమరావతిలో.. టూరిజం హబ్‌, ఆలయ పర్యాటకం, పాఠశాలలు, సంస్కృతి, సత్తెనపల్లిలో.. హెవీ ఇండసీ్ట్రస్‌ హబ్‌, టెక్స్‌టైల్స్‌ అండ్‌ మినరల్స్‌ హబ్‌, గుంటూరులో.. అగ్రికల్చరల్‌ ట్రేడింగ్‌ హబ్‌, ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌, తెనాలిలో.. మానుఫాక్చరింగ్‌ హబ్‌, ఆగ్రో, టెక్స్‌టైల్‌, మెటల్‌ అండ్‌ మినరల్‌, గుడివాడలో.. అగ్రికల్చరల్‌ హబ్‌, లాజిస్టిక్‌ పార్కు, గన్నవరం లో.. శ్రీ సిటీజెడ్‌, ఎస్‌ఈజెడ్‌, జోన్‌, టైక్స్‌టైల్స్‌, ఆటో, ఎరోస్పేస్‌, ఐటీ అండ్‌ ఐటీయీఎస్‌, నూజివీడులో ఫ్యాబ్రికేషన్‌ హబ్‌, రబ్బర్‌ అండ్‌ ఫ్యాబ్రికేటెడ్‌ మెటల్స్‌.
కృష్ణానదిపై వంతెనలు
కొత్త రాజధాని ప్రాంతానికి రోడ్డు రవాణాను సులభతరం చేసేందుకు ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన మూడు వంతెనలు, దిగువన ఒక వంతెన నిర్మిస్తారు. ఎగువన నిర్మించే మూడు వంతెనల్లో ఒక వంతెనకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు గుంటూరు, విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుం డా కొండపల్లి ఖిల్లా మీదుగా ఏలూరువైపు వెళ్లటానికి, కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. దీనిపైన నందిగామ వద్ద మరో వంతెన వస్తుంది. ప్రకాశం బ్యారేజ్‌ దిగువన జాతీయ రహదారిని కలుపుతూ వంతెన నిర్మిస్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇకపై రహదారుల నిర్మాణాలకు భూసేకరణ చేయా ల్సివస్తే, లాండ్‌ పూలింగ్‌ విధానమే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్‌ రూపొందించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికను మంత్రి వర్గం ఆమోదించింది. సీడ్‌ కేపిటల్‌పై జూన్‌ నాటికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది.
హెచ్‌ఎ్‌సఆర్‌, డీఎ్‌ఫసీ
విజయవాడ మీదుగా వైజాగ్‌-చెన్నైలకు జాతీయ హైస్పీడ్‌ రైల్‌ (హెచ్‌ఎ్‌సఆర్‌) కనెక్ట్‌ చేయడం. ప్రస్తుతం ఉన్న రైల్‌నెట్‌వర్క్‌ను పరిరక్షిస్తూ విజయవాడ-హైదరాబాద్‌ రైలు మార్గంలో హైస్పీడ్‌ రైళ్లు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని బెంగుళూరుతో కనెక్ట్‌ చేస్తూ రాజధానిలోహై స్పీడ్‌ రైలు టెర్మినల్‌.. ఏపీ రాజధాని నుంచి బెంగుళూరుకు హైస్పీడ్‌ రైలు ప్రతిపాదన. విశాఖ, గుడివాడ, తెనాలి, గుంటూరు, చెన్నై.. సముద్రతీరాన్ని కనెక్ట్‌ చేస్తూ డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ (డీఎ్‌ఫసీ) ఏర్పాటు. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ డీఎ్‌ఫసీ కారిడార్‌.
జలమార్గాలు…
కృష్ణానది ఉత్తర-దక్షిణ దిశలను అనుసంధానం చేస్తూ బకింగ్‌ హామ్‌కెనాల్‌ జలమార్గం పునరుద్ధరణ. ప్రకాశం బ్యారేజ్‌ దిగువకు జలమార్గం. విజయవాడ, తెనాలి, కేంద్రాలుగా వాటర్‌ లాజిస్టిక్‌ హబ్‌లను అభివృద్ధి చేయనున్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *