Breaking News

ఆర్మీనియా గురించి

ఆర్మీనియా గురించి
ఆర్మీనియన్ల సంప్రదాయ నృత్యాలలో చాలామేరకు పురుషులు నడుముకు కత్తులు ధరిస్తారు. ఇది వారు ఆయుధోపజీవులని సూచిస్తుంది. ఆర్మీనియన్ల జాతీయ ఫలం ఆప్రికాట్. గతంలో వారి జాతీయ చిహ్నం మీద ద్రాక్ష గుత్తులు ఉండేవి. ఇది ఆర్మీనియా దేశంలో పండ్ల తోటలు ఎంత ఎక్కువగా ఉంటాయో సూచిస్తుంది. ఈ చిన్న దేశంలో చాలా ప్రాంతాలనుంచి మౌంట్ అరారత్ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. నోవా (Noah) అనే పెద్దాయన జలప్రళయం (Deluge) వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని సకల జీవరాశులనూ రక్షించడానికి ఒక పెద్ద ఓడను తయారు చేసి, దానిలో సకల జీవ జాతుల స్త్రీ, పురుష జీవులను ఎక్కించుకున్నాడట. జల ప్రళయం తగ్గుముఖం పట్టాక ఆ ఓడ అతి ఎత్తైన Mount Ararat అనే పర్వత శిఖరం తాకి ఆగిపోయిందట. ఆ ఓడనే Ark of Noah అంటారనీ, అంతకు ముందరి సృష్టి మొత్తం ఆ జలప్రళయం సందర్భంగా నశించిపోగా, ఓడలో రక్షింపబడిన జీవ జాతులు ఇక అక్కడినుంచీ పునరుత్పత్తి మొదలు పెట్టాయనీ, ఈ జాతులన్నీ పరస్పరం ఎలాంటి ఘర్షణ లేకుండా ఎలా జీవించాలో తెలిపే కొన్ని నియమాలను నోవా రూపొందించాడనీ బైబిల్ పాత నిబంధనావళి కథనం. ఈ జలప్రళయం ప్రస్తావన, దాని నుంచి మానవ జాతులను కాపాడి, వారి భవిష్య జీవనాన్ని నిర్దేశిస్తూ మనువు ధర్మశాస్త్రాన్ని రూపొందించడం వంటి విషయాలు మన పురాణాలలో ఉన్నాయి. మహమ్మదీయుల ఖుర్ – ఆన్ లోనూ ఇదే జలప్రళయం ప్రస్తావన, దాని నుంచి జీవులను రక్షించిన ‘ను – అలై’ ప్రస్తావన ఉన్నాయి. నోవా, మను, ను – అలై పేర్ల మధ్య పోలిక గమనార్హం. మానవ నాగరకత తొలి నాళ్లలో ఒక జల ప్రళయం వచ్చిందనీ, దాని ప్రస్తావనలు మత గ్రంథాలన్నిట్లో ఉండడాన్ని బట్టి, తొట్టతొలి మానవులు కాకసస్, నల్ల సముద్రం ప్రాంతాల నుంచే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించారని కొందరి అభిప్రాయం. అయితే ఈ సిద్ధాంతం నిర్వివాదాంశం మాత్రం కాదు.
armanium armanium00 armanium01 armanium02 armanium03 armanium04 armanium05 armanium06 armanium07
సముద్ర మట్టానికి దాదాపు 17 వేల అడుగుల ఎత్తున ఉన్న గ్రేటర్ అరారత్ శిఖరం, దానికి కొంచెం దూరంగా ఉన్న లిటిల్ అరారత్ శిఖరం – ఈ రెండూ నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతాలు (Dormant Volcanoes) . వీటి శిఖరాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. ఆకర్షణీయమైన అరారత్ శిఖరం అంటే ఆర్మీనియన్లకు ప్రాణం. అందుకే వారి జాతీయ చిహ్నంలో ఆ గిరి శిఖరం చోటు చేసుకుంది.
ఆర్మీనియన్లకు ప్రాణప్రదమైన ఈ శిఖరం ప్రస్తుతం టర్కీ భూభాగంలో ఉంది. అయితే ఈ సమున్నత శిఖరాలు ఆర్మీనియా లోని అరారత్ మొదలైన పలు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఆర్మీనియా రాజధాని ఎరవాన్ నగరానికి నేపథ్యంలో ఈ అరారత్ శిఖరాలు ముచ్చటగా కనువిందు చేస్తుంటాయి. మిత్రుడు రాజేష్ వేమూరి ఇటీవల కుటుంబ సమేతంగా ఆర్మీనియా దేశాన్ని సందర్శించి పెడుతున్న టపాలు చూసి, ఒకప్పటి సోవియట్ యూనియన్ లో అంతర్భాగమైన ఆర్మీనియా గురించి నాకు తెలిసిన కొన్ని ముక్కలు మిత్రులతో పంచుకుంటున్నాను.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *