Breaking News

శైవవైష్ణవ దర్శనీయ క్షేత్రం అన్నవరం

Annavaram-Satyanarayana-Swamy(1) annavaram01 Annavaram swamy 97_big satyanarayana swamy pooja photocm_annavaramsatyanarayanaswamy6122013
శైవవైష్ణవ దర్శనీయ క్షేత్రం అన్నవరం
 
అన్నవరం ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. రత్నగిరి కొండపైన సత్యదేవునికి ఒక ప్రక్క అనంతలక్ష్మి, మరొకవైపు శివలింగమూర్తి ఉంటాయి. సత్యదేవుని గొప్పత నాన్ని రేకాఖండములో స్కందపురాణములో వివరిం చారు. శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి దివ్యక్షేత్రంగా, ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉం టుంది. వైష్ణవులు, శైవులు కూడా విశేషంగా దర్శిం చుకుంటారు. హిందువులు అతి పవిత్రంగా భావిం చే విశేష మాసాలలో ప్రత్యేకించి కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో అశేష భక్తజనకోటి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయ మునందƒలి సత్యదేవుడు భక్తులపాలిట కొంగుబం గారమై వారిని హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తా్య త్మక రూపములో దీవెనలు ఇస్తున్నారు. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్ర హం 13 అడుగుల ఎత్తులో ఉం టుంది. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉంటుంది. త్రిమూర్తులుగా పూజించబడటం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులలో వర్ణించ బడిన యంత్రం ఇక్కడే ఉంది.
 
స్వామివారి వ్రతం-ప్రసాదముల విశిష్టత:
 
వ్రతం అంటే పుణ్యసాధన. పాపనివృత్తికి, నియమానుసారంగా చేసే పూజా విధానం. అయితే శ్రీ స్వామివారి వ్రతం కోరికలు నెరవేరడానికి (కామ్యము) చేసేది, మరియు వివాహం మొదలైనవి చేసేటప్పుడు మరియు కోరికలు తీరిన నియత్రంగా చేసేది. అయితే తెలుగువారింట శ్రీ స్వామివారి వ్రతం చేయని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ వ్రతం కల్పోక్తంగాగానీ, శాస్త్రీయమైన పురుషసూక్త విధానంగాగానీ చేసుకోవచ్చు. స్కాందపురాణంలోని దేవఖండములో అయిదు అధ్యాయాలుగా ఈ వ్రతవిధానం ఉంటుంది. కల్పోక్తంగా ఈ స్వామవవారి వ్రతాన్ని చేసే ప్రసాదం స్వీకరించి కష్టాలను పోగొట్టుకుని, సుఖ సౌఖ్యాలను పొందినవారి వృత్తాంతాలు ఇందులో ఉంటాయి. స్వామివారి వ్రతాన్ని ఏ వర్గంవారైనా చేసుకోవచ్చును. భతవంతుడు సర్వసమానుడు. సమరస స్వభావం కలవాడు అని తెలియును. దేవాలయాలు, నదీతీరాలు, స్వామివారి సన్నిధిలో చేసుకున్న వ్రతము సర్వదా ఫలదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి సన్నిధిలో 3 లక్షలకు పైగా వ్రతాలు జరుగుతున్నాయి…దీనినిబట్టి స్వామివారి విలువను గ్రహించవచ్చును.
 
హిందువులు శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామి వ్రతాన్ని భారతదేశం అంతా కూడా విద్య, అభివృద్ధి, సంతానం, ధనం, కష్టములనుండి విముక్తి కోసం, ఆరోగ్యం కోసం, వృత్తిలో విజయాలకై తదితర అంశాల కొరకు చేస్తూ ఉంటారు. ఏకాదశి, పౌర్ణమి, రవి సంక్రమణమున (సూర్యుడు ఒక రాశినుంచి మరో రాశికి మారేటప్పుడు ఏర్పడు సంక్రాంతులకి) గానీ ఈ వ్రతాన్ని వారి వారి శక్త్యానుసారం చేసుకుంటారు. కొందరు సంవత్సరానికి ఒకసారి, మరికొందరు నెలకి ఒకసారి ఇలా వారి వారి స్థితిగతులను బట్టి సత్యవ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. అయితే అన్నవరం చాలా మహిమగల ప్రదేశం. కనుక ఇక్కడ అనంత ఫల ప్రదాయకం. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అన్నభావన మరియు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవెంకట సత్యన్నారాయణుని అనుగ్రహం పొందుతారు. ఇక్కడ విశేషంగా భక్తులు కొరకు రకరకాల సేవలు, శాశ్వత వ్రతాలు, శాశ్వత కళ్యాణాలు, నిత్యాన్నదాన వితరణ మొదలైనవి ఉన్నాయి. అన్నదానంకు విశేషంగా ఇక్కడ ఆదరణ ఉండటం వలన అన్నవరం అని పేరు వచ్చినట్లు నమ్ముతారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *